Thursday, February 25, 2010
పుస్తక పఠనం
నేటి రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోతోంది. పుస్తకం మంచి స్నేహితుడి లాంటి వాడని మన పెద్దలు ఎప్పుడో్ చెప్పారు. అయితే నేటి కంప్యూటర్ కాలంలో పుస్తకాలు చదవడం గగనమైపోయింది. పుస్తకం చదవడం అలవాటుగా ఉన్నవారు కూడా.... ఆ అలవాటును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక పిల్లలు పుస్తక పఠనమంటేనే అదో అనవసరమైన విషయంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో పిల్లలకు మార్గదర్శకంగా ఉండి వారిని ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులే. స్కూల్ లో టీచర్లు కూడా బుక్ రీడింగ్ పై పిల్లలకు అవగాహన కల్పించాలి. గతంలో చందమామ లాంటి పుస్తకాలు చదివి ఎంతో నేర్చుకునేవారు.అయితే ఇప్పుడు చందమామ పుస్తకాలు ఆకాశంలో చందమామలాగ దూరంగానే ఉండే పరిస్థితి వచ్చింది. నేటి నుంచి ఆ దృక్పథాన్ని మార్చుకుందాం. మనందరమూ పుస్తకాలు చదువుదాం. రేపటి తరాలకు పుస్తక పఠనాన్ని అలవర్చుదాం.. నాఈ ప్రయత్నంలో మీరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment