Thursday, June 17, 2010

భారత్ లో అవినీతి

దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతిని చూసి అయ్యో అవినీతి పెరిగిపోతోందని మాట్లాడుకుంటాం. కానీ... మనం మాత్రం అవినీతిని అంతం చేయడానికి చిన్న పాటి ప్రయత్నం కూడా చేయలేం. పేపర్లో, టీవీల్లో అవినీతిని చూసి దేశం ఎంత పాడైపోయిందని బాధపడతాం. అదే మన వరకు వచ్చే సరికి మన పని కావడానికి లంచం ఇవ్వడానికి కూడా వెనకాడం. పని ఎలా జరిగిందనేది ముఖ్యం కాదు.. పని జరిగిందా లేదా.. అనేది ఇక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశంలో ప్రజల్లో మార్పు రానిదే వ్యవస్థలో మార్పు రాదు. అక్కడక్కడా ఆడదాపాడదా అవినీతి ఎదిరించేవాళ్లున్నా వాళ్లకు సరైన మద్దతు దొరకడం లేదు. సపోర్ట్ చేసే వారు లేక వారు కూడా రాజీ పడిపోతున్నారు. ఈ బ్లాగ్ లో అవినీతిపై ప్రత్యేకంగా ప్రస్తావించింది ఎందుకంటే... రోజూవారీ జీవనంలోప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో లంచం, సిఫార్సులు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. తమను లంచం అడిగిన వారిని నిలదీసే ధైర్యం చేయడానికి ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదే. మన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఏమైపోయాయి. గాంధీపి కలలుగన్న సమసమాజం నిర్మాణం ఎలా సాధ్యం.. చదువుకున్న వారు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరముంది. మన గొంతు సవరించుకునిన ఇది తప్పు... తప్పుడు పనులు చేయకూడదనే నినాదాన్ని మనం వినిపించకపోవడం వల్లనే దేశంలో ఇంత అవినీతి పేరుకుపోయింది. ఇతర దేశాల్లో అవినీతి నిరోధానికి పటిష్టమైన వ్యవస్థ ఉంది. అదే భారతదేశంలో వ్యవస్థలోనే అవినీతి నిండిపోవడంతో అడుగడుగునా అవినీతి. అదే దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తోంది. ఈ గోడలను బద్దలు కొడదాం.. అవినీతి అంతానికి సిద్దమవుదాం. గొంతూ గొంతూ కలిపి కరప్షన్ అనే మాటను డిక్షనరీలో లేకుండా చేద్దాం... ఫ్రెండ్స్. రెయిస్ యువర్ వాయిస్.. ఫైట్ అగైనస్ట్ కరప్షన్ ... కమ్ జాయిన్ విత్ మి.. దిస్ ఈస్ నాట్ ఇంపాజిబుల్. ఎవ్రీధింగ్ ఈస్ పాజిబుల్..

Friday, March 19, 2010